వాలెంటైన్స్ డే… ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 14న) ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ తెగ వైరలవుతుంది. దాదాపు 7 సంవత్సరాలుగా ఆ పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది. ముఖ్యంగా పాటలోని ప్రతి చరణం… గుండె పగిలిన అబ్బాయిని ఏడిపించేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్.. ఈ స్టేజ్ దాటి ముందుకు రావడం అంత సులభం కాదు. ఎంతో మంది తమ ప్రేమను మార్చిపోయి ముందుకు సాగుతుంటారు. మరికొందరు గుండెల్లో బాధను మోస్తూనే జ్ఞాపకాలతో సతమతమవుతుంటారు. అయితే లవ్ ఫెయిల్యూర్ పాటలు మాత్రం మరోసారి ఆ జ్ఞాపకాలను కళ్ల ముందుకు తెస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ సైతం ప్రతి కుర్రాడి మనసును మెలిపెట్టేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పేరు “గుర్తుకొచ్చినప్పుడల్లా..” ఒకప్పుడు ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది.
“గుర్తుకొచ్చినప్పుడల్లా..
గాయాలు చేశావు ఈ జన్మకు..
భారాన్ని వేశావు నా జన్మకు..
బంధాన్ని తెంపావు ఈ జన్మకు..
మరుపంటు రావమ్మ ఏ జన్మకు..
మారిపోయావే ఓ పిల్లా..
మరచిపోయావే నన్నిల్లా..” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. 2019లో విడుదలైన ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగింది. ఈ పాటకు కళ్యాణ్ సంగీతం అందించగా.. లక్ష్మణ్ సాహిత్యం అందించారు. ఫోక్ సింగర్ రాము ఈ లవ్ ఫెయిల్యూర్ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించాడు. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ?
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..