భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ


సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిగా సుపరిచితురాలు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫిబ్రవరి 7న రోజ్ డే సందర్భంగా, తన భర్త రాహుల్ కుమార్‌కు గులాబీ పువ్వు ఇచ్చి, ఆ తర్వాత మద్యం పోసి ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు, ఆమె పిస్టల్‌తో పోజిచ్చిన మరో ఫొటో కూడా వైరల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *