సినిమా సెలబ్రిటీల జీవితమంటే రంగుల పాన్పు కాదు. వారికి కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందుల ఉంటాయి. కానీ పెద్దగా చెప్పుకోరు. మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ కష్టాలను పంచుకుంటుంటారు. అలా గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఓ అందాల తార తన జీవితంలోని చేదు నిజాలను అందరితో షేర్ చేసుకుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడితే చాలు హీరోయిన్ల కెరీర్ అగమ్య గోచరంగా మారుతుంది. సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ గతంలో పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రమే కనిపిస్తూ తన గోడను వెళ్లబోసుకుంటోంది.
2001 ఆనందం సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది రేఖా వేద వ్యాస్. అందులో తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని తర్వాత ఒకటో నెంబర కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే 2012 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు రేఖ. అయితే ఆ మధ్యన కొన్ని టీవీ షోలతో పాటు ఇంటర్వ్యూలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
గత కొన్నేళ్లుగా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా చాలా కుంగిపోయాను. హెల్త్ కండీషన్స్ సరిగా లేకపోవడంతోనే సినిమాలకు దూరమయ్యాను. గతంలో నాకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకుందామంటే నా పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏదో తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా మంచి సంబంధం కావాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డానంటే అది దేవుడి దయనే’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ హీరోయిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. రేఖ త్వరగా కోలుకోవాలని, ఆమెకు మళ్లీ మంచి రోజులు కావాలని ప్రార్థిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.