4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!

4-lane Highway : తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 4లైన్ హైవేకు ఆమోదం!


శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ సెక్షన్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీర రహదారి 167 కింద సుమారు 80 కి.మీ మేర ఈ రోడ్డు నిర్మాణం కానుంది. రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌ నగర్‌ మీదుగా హైదరాబాద్‌కు ఉన్న ఈ కనెక్టివిటీకి ఈ కొత్త నాలుగు లైన్‌ల హైవేను అటాచ్ చేస్తూ నిర్మాణం చేపట్టనున్నారు.

హైదరాబాదు పనాజీ కారిడార్‌లో 4లైన్ హైవే

దీంతో పాటు హైదరాబాదు పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సైతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దమాసియా బిటాడ నర్సాపూర్మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి 4,584 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే గోతి- ట్రిమ్బక్ – పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం 3320 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది.

రూ. 2,254 కోట్లతో నోయిడా మెట్రో ఆక్వా లైన్

అలాగే రూ. 2,254 కోట్లతో నోయిడా మెట్రో ఆక్వా లైన్ 11.6 కిమి పొడిగింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా బొటానికల్ గార్డెన్ నుంచి నోయిడా సెక్టార్ 142 వరకు మెట్రో లైన్ పొడిగింపునకు నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అలాగే రూ. లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాష్ట్రాలకు రుణసాయం చేయాలని నిర్ణయించింది. స్టార్టప్ ఇండియా ఫండ్ 2.0 కి 10 వేల కోట్ల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 13.3 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలిపింది. 2024 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 1,89,601 కోట్లతో 49 రైల్వే ప్రాజెక్టులకు , రూ. 2,48,053 కోట్లతో 24 జాతీయ రహదారుల ప్రాజెక్టులును కేంద్రం చేపట్టింది. అలాగే రూ. 1,15,406 కోట్లతో 9 మెట్రో ప్రాజెక్టులు, రూ. 7,339 కోట్లతో నాలుగు నూతన ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

రూ. 1,45,945 కోట్లతో పోర్టు నిర్మాణానికి, రూ. 6,811 కోట్లతో రెండు రోప్ వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. అలాగే 3 హైడ్రో ప్రాజెక్టులకు గాను బడ్జెట్‌లో రూ. 28,432 కోట్ల నిధులను కేటాయించింది. అంతేకాకుండా రూ. 28,602 కోట్లతో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు అమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజనకు కింద రూ. 5,36,137 కోట్లు కేటాయింపు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *