Headlines

అభివృద్ధి, మౌలిక సదుపాయాలే లక్ష్యం.. రూ. 1,60,504 కోట్ల విలువైన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్!

అభివృద్ధి, మౌలిక సదుపాయాలే లక్ష్యం.. రూ. 1,60,504 కోట్ల విలువైన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్!


దేశంలో వేగవంతమైన అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రైల్వేలు, స్టార్టప్‌లు, అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రధాన నిర్ణయాలు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం (ఫిబ్రవరి 14, 2026) కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. సుమారు రూ. 1.6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్న ఈ ప్రాజెక్టులు దేశ రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తాయని, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం కీలకమైనదన్నారు.

రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించడం, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పట్టణ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ చర్యలు ఉపాధి అవకాశాలను పెంచుతాయని, వ్యాపార కార్యకలాపాలను పెంచుతాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయాలు దేశ లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తాయని, పారిశ్రామిక అభివృద్ధిని పెంచుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు.

ఇందులో భాగంగా అంబాలా – ఢిల్లీ మధ్య 3,4 లైన్ , కసార – మన్మాడ్ మధ్య 3,4 లైన్, హోస్‌పేట్ – బళ్ళారి మధ్య 3,4 లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కసార – మన్మాడ్ మధ్య రూ. 10154 కోట్లతో 131 కిమీ మేర రైల్వే లైన్లు నిర్మితం కానున్నాయి. ఇక కసార – మన్మాడ్ లైన్ ముంబై నుంచి నార్త్ ఈస్ట్ ఇండియాకు కనెక్టివిటీ పెరుగుతుంది. కొండ ప్రాంతాల్లో 5 టన్నెల్స్‌తో 28 కి.మీ మేర రైల్వే లైన్ నిర్మాణం ఉండనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొండ ప్రాంతాలు తిరిగి వెళ్ళకుండా దూరం తగ్గించేలా నిర్మితం కానున్న కసార మన్మాడ్ 3,4 లైన్లు ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. 46 మిలియన్ టన్నుల కార్గో తీసుకెళ్ళకెందుకు ఈ లైన్ ఉపయోగపడతాయి. దీంతో ప్రతిసంవత్సరం 1200 కోట్లు లాజిస్టిక్ సేవలు ఆదా అవుతాయని కేంద్ర మంత్రి వెల్లండిచారు.

ఇక అంబాల – ఢిల్లీ మధ్య రూ. 5983 కోట్లతో 194 కి.మీ మేర 3,4 లైన్లు నిర్మాణం కానున్నాయి. దీంతో ఢిల్లీ హర్యానా మధ్య రైల్వే కనెక్టివిటీ మెరుగుపడనుంది. నాలుగేళ్లలో అంబాల – ఢిల్లీ మధ్య 3,4 లైన్లు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిసంవత్సరం 932 కోట్లు లాజిస్టిక్ సేవలు ఆదా అవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే, హోస్‌పేట్ – బళ్ళారి మధ్య రూ. 2372 కోట్లతో 65 కి.మీ మేర 3,4 లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. నాలుగేళ్లలో 3,4 లైన్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *