వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణంతోపాటు వస్తువుల అమరిక, ఏ వస్తువులు ఎలా? ఎక్కడ ఉంటే శుభం జరుగుతుందనే విషయాలు తెలియజేస్తుంది. అశుభ ఫలితాలు రాకుండా నివారణలను సూచిస్తుంది. మనం సాధారణంగా ఉపయోగించే పర్సు లేదా వ్యాలెట్ గురించిన సూచనలు కూడా వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. మీ పర్సులో డబ్బు లేదా మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? ఈ వాస్తు దోషాలకు నివారణల గురించి వాస్తు శాస్త్రం మనకు కొన్ని విషయాలు చెబుతుంది. చాలా మంది తరచుగా తమకు తెలియకుండానే తమ పర్సుల్లో ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించే, డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగించే వస్తువులను తీసుకెళ్తుంటారు. చిరిగిన లేదా మురికిగా ఉన్న పర్సును ఉపయోగించడం అత్యంత సాధారణ తప్పు, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అటువంటి సందర్భాలలో, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వాస్తు అనేక పరిష్కారాలను సూచిస్తుంది. ఈ నివారణలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను పొందగలవు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన వాస్తు సూచనలు..
పర్సు శుభ్రంగా ఉంచండి
పాత బిల్లులు, రసీదులు, చిరిగిన నోట్లను పర్సులో నిల్వ చేయడం ఆర్థిక లాభాన్ని అడ్డుకుంటుంది. చిరిగిన లేదా మురికిగా ఉన్న పర్సును వాడకండి. కొంచెం పర్సు చెత్తగా ఉన్నా, వెంటనే కొత్తది మార్చండి.
పర్సు రంగు
నలుపు, గాఢ నీలం లేదా ఇతర గాఢ రంగులు ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. బదులుగా ఆకుపచ్చ, గోధుమ, క్రీమ్ వంటి రంగుల పర్సులను ఉపయోగించండి.
పర్సులో ద్రవ్య చిత్రాలు లేదా దేవతల చిత్రాలు ఉంచకండి
వాస్తు ప్రకారం, పర్సులో దేవతల చిత్రాలు ఉంచడం అశుభకరం, ఆర్థిక సమస్యలను కలిగించవచ్చు. బదులుగా, ఎర్రటి కాగితంతో చేసిన సూర్య యంత్రం పెట్టడం మంచి సూచన.
నెమలి ఈక ఉపయోగించండి
పర్సులో నెమలి ఈక పెట్టడం శుభకరం. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, ఆర్థిక లాభాలను పెంచుతుంది. అదనంగా, పసుపు రంగు చిన్న కట్టులో కొద్దిగా బియ్యం గింజలు, పసుపును ఉంచి పర్సులో పెట్టడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. ఈ చిన్న వాస్తు మార్పులు చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసి, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందవచ్చు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)