గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఉజ్బెకిస్తాన్‌కు చెందిన 14 ఏళ్ల దిల్షాద్ అనే బాలుడికి హర్యానాలోని గురు గ్రామ్‌లో ఉన్న ఆర్టెమిస్ ఆసుపత్రి వైద్యులు మెకానికల్ హార్ట్‌ను అమర్చి ప్రాణాలను నిలబెట్టారు. పదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దిల్షాద్ గుండె కండరాలు బలహీనపడటంతో శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేయడం కష్టమైంది. గత ఏడాది నుంచి అతని ఆరోగ్యం మరింత క్షీణించి, తరచుగా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందేవాడు. ఉజ్బెకిస్తాన్‌లో చివరి దశ గుండె వైఫల్యానికి చికిత్స లేకపోవడంతో, అక్కడి వైద్యులు దిల్షాద్‌ను భారతదేశానికి తరలించాలని సూచించారు. రెండు నెలల క్రితం బాలుడిని గురు గ్రామ్‌లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ గుండె మార్పిడి కోసం దిల్షాద్ పేరును వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో కాలేయం, మూత్రపిండాల వంటి అవయవాలు కూడా పనిచేయడం మానేశాయి. గుండె దాత దొరికే వరకు బాలుడు ప్రాణాలతో ఉండడం కష్టమని వైద్యులు గుర్తించారు. దీంతో, అతని ప్రాణాలను కాపాడటానికి లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (LVAD) లేదా మెకానికల్ హార్ట్‌ను అమర్చాలని నిర్ణయించారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?