Kadapa: వాలంటైన్స్ డే రోజు విషాదం.. ప్రియుడి కళ్లముందే ప్రియురాలు మృతి..

Kadapa: వాలంటైన్స్ డే రోజు విషాదం.. ప్రియుడి కళ్లముందే ప్రియురాలు మృతి..


Kadapa: వాలంటైన్స్ డే రోజు విషాదం.. ప్రియుడి కళ్లముందే ప్రియురాలు మృతి..

ఏపీలో వాలంటైన్స్ డే రోజే విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ప్రేమ జంటను లారీ ఢీకొనడంతో.. స్పాట్‌లోనే యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా విహారయాత్రకు బయలుదేరిన మూడు ప్రేమ జంటలు.. బైక్‌లపై జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ గండికోటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ లారీ.. ఒక జంట ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో యువతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. తిరుపతి నుంచి గండికోటకు వెళ్తుండగా.. ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *