పేద ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటి గడువు మరో ఏడాది పెంపు! వెంటనే అప్లై చేసుకోండి!

పేద ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటి గడువు మరో ఏడాది పెంపు! వెంటనే అప్లై చేసుకోండి!


రాష్ట్రంలోని అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లు ఏర్పాటు చేసుకున్న పేదలకు సర్కార్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో ఉన్న నివాస గృహాల క్రమబద్ధీకరణ పథకాన్ని మరోసారి పొడగించింది. ప్రభుత్వ భూముల్లో జనాలు ఏర్పాటు చేసుకున్న నివాసాల ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు నిర్ణిత గడువుతో ప్రభుత్వం గతంలో పేదలకు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు గతేడాది డిసెంబర్ 31తోనే ముగిసిపోయింది.

అయితే ప్రజల అభ్యర్థన మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్‌రావు గడువు పొడగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ గడువును మరో ఏడాది పాటు అనగా డిసెంబర్ 2026 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నం.115 ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే గతంలో జీవో నెంబర్ 30లో భాగంగా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ పథకం గురించి జనాల్లో అవగాహన లేకపోవడంతో చాలా మంది దీని కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

దీనికి అర్హులు ఎవరూ

2019 అక్టోబరు 15 తేదీకి ముందు నుంచి అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఇళ్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. అయితే150 జాలలోపు ఇళ్లు స్థలం ఉన్నవారు తమ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 150 నుంచి 450 గజాల మధ్య ఉన్నవారు రిజిస్ర్టేషన్‌ విలువలో 50శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *