విజయ్ దేవరకొండ, రష్మిక మందనా త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఇద్దరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుందని తెలుస్తోంది. దీని కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక వెడ్డింగ్ వీడియో రైట్స్ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అయితే, ఈ ఆఫర్‌ను రౌడీ బాయ్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించారు. పెళ్లి వీడియో ప్రసారం కోసం వచ్చిన ఆఫర్ చాలా పెద్దదని, ఇది గతంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి రైట్స్‌కు అమ్ముడైన 25 కోట్ల ఆఫర్ కంటే రెట్టింపు అని సమాచారం. బాలీవుడ్‌లోనూ ఇలాంటి ఓటీటీ డీల్స్ సర్వసాధారణం. అయినప్పటికీ, పెళ్లి అనేది కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగాల్సిన ఒక ప్రైవేట్, వ్యక్తిగత వేడుక అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ఆ విలువైన జ్ఞాపకాలను తమ మధ్యే ఉంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో విజయ్ దేవరకొండపై అభిమానుల్లో గౌరవం మరింత పెరిగింది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?