Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్‌గా ప్రజా సేవ..!

Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్‌గా ప్రజా సేవ..!


ఆమె ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదేశాల మేరకు పనిచేసింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30ఏళ్లు తన సేవలు అందించింది. ఆమె ఇపుడు మరో రూపంలో తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వెంకటమ్మ నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలిగా పని చేశారు. పట్టణ ప్రజారోగ్యం కాపాడేందుకు తన సేవలు అందించింది. వెంకటమ్మ తొలుత నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా 30 ఏళ్లుగా చేసింది. చివరికి వెంకటమ్మ సఫాయి కార్మికురాలిగా 2019 డిసెంబర్ రిటైర్మెంట్ అయింది. ఆ తర్వాత కూడా మునిసిపాలిటీలో పనిచేసిన అనుభవంతో చుట్టుపక్కల వారి అవసరాల్లో సహాయం చేస్తూ ఉండేది.

ఇలా వెంకటమ్మ నిత్యం జనంతో కలిసి మెలిసి ఉండేది. ఫిబ్రవరి 13న వెలువడిన నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 10వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రాణిపై 10 ఓట్ల మెజారిటీతో వెంకటమ్మ విజయం సాధించారు. దీంతో ఆమె నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఇదే మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఇదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఎన్నిక కావడం విశేషం. సామాన్య కార్మికురాలి స్థాయి నుండి ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా ఎదిగిన వెంకటమ్మ ప్రయాణం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *