కార్లు, బస్సుల్లో వెళ్తున్నపుడు పాటలు వినాలంటే ఎఫ్ఎం లేదా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, అవేమీ అక్కర్లేకుండానే హైవేపై వెళ్తున్నపుడు మ్యూజిక్ వినిపిస్తే ఎలా ఉంటుంది? రోడ్డుపై ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఇలాంటి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇప్పటి వరకు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇపుడు ఇండియాలోనూ ప్రారంభమైంది. ముంబయి కోస్టల్ రోడ్డులో ఏర్పాటు చేసిన 700 మీటర్ల మ్యూజిక్ రోడ్డును అక్కడి సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. రహదారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్తులపై వాహనాన్ని నడిపించడం ద్వారా మ్యూజిక్ వినొచ్చు. ముంబయి కోస్టల్ రోడ్ అధికారులు తొలి మ్యూజికల్ రోడ్డును ప్రారంభించి రికార్డు సృష్టించారు. “నారిమన్ ప్రాంతం నుంచి వర్లి” వైపు వెళ్లే రోడ్డుపై హంగేరియన్ టెక్నాలజీ సాయంతో సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై దాదాపు 700 మీటర్లు ప్రయాణించే “జయ హో’ పాటను ఆస్వాదించనున్నారు. ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ పాటను ఎంచుకున్నామని అధికారులు చెప్పారు. మ్యూజికల్ రోడ్డుకు 6.21 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఇటువంటి మ్యూజికల్ రోడ్లు హంగరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్