బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!


అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్‌ని ఉత్పత్తి చేయవు. 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అందుకే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఈ కలపకు నకిలీలు ఎన్నో వచ్చాయి. అస్సాం రాష్ట్రం అగర్వుడ్‌కి ప్రసిద్ధి. చైనాలో జరిగిన వేలంలో 2 కిలోల కలప ఏకంగా 154 కోట్ల రూపాయలు అమ్ముడైంది. అంటే ఓ రెండు కేజీల ముక్కే కోట్ల విలువ ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అగర్‌ వుడ్‌ని ఖరీదైన పెర్ఫ్యూమ్‌లలో వాడతారు. దుబాయ్, పారిస్ లో లగ్జరీ సెంట్‌ల తయారీతో దీని డిమాండ్ పెరిగింది. హిందూ, బౌద్ధ, ఇస్లాం మత ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమికి దీనిని ఉపయోగిస్తారు. డిమాండ్ కు తగినన్ని అక్విలేరియా చెట్ల పెంపకం జరగడం లేదు . అందుకే అగర్వుడ్ అమ్మకాలపై కఠిన నియమాలను పాటిస్తున్నారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మాలన్న నిబంధన ఉంది. బంగారం నేలలో దొరుకుతుంది. ఈ కలప బంగారం కావాలంటే కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *