Actress Supritha: వాడు నా నంబర్ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడట.. ఏమని మెసేజ్ చేశాడంటే..?

Actress Supritha: వాడు నా నంబర్ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడట.. ఏమని మెసేజ్ చేశాడంటే..?


నటి సుప్రీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాలను, సోషల్ మీడియా అనుభవాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తన బోల్డ్ వ్యాఖ్యలకు, ముక్కుసూటితనానికి ప్రసిద్ధి చెందిన సుప్రీత, మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియాలో తనకు తరచుగా వచ్చే విచిత్రమైన ప్రపోజల్‌ల గురించి సుప్రీత ప్రస్తావించారు. ఇటీవలే జరిగిన ఒక సంఘటనను తెలియజేస్తూ.., ఒక గుర్తుతెలియని వ్యక్తి తన నెంబర్ పొందడానికి రూ.20,000 చెల్లించాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తనకు కాల్ చేసి, “నేను మీ నెంబర్‌ కోసం ఇంత పే చేశానంటే, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటానో అర్థం చేసుకోండి. మీకు డబ్బులు పంపిస్తాను, మీరు ఇప్పుడు ఒప్పుకుంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. మీరు ఏదంటే అది” అని ప్రపోజ్ చేసినట్లు సుప్రీత వెల్లడించారు. ఈ ప్రపోజల్‌ను విని తాను నవ్వుకుని, వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు ఆమె వివరించారు. తనలాంటి వ్యక్తులకు అలాంటి ప్రపోజల్‌లు ఎందుకు వస్తాయో అర్థం కాదని ఆమె అన్నారు.

కామెంట్ సెక్షన్ల పట్ల తన వైఖరిని కూడా సుప్రీత స్పష్టం చేశారు. చాలా మంది ఆమె రీల్స్‌ను కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా ఇతర ఛానెల్స్‌లో పోస్ట్ చేస్తున్నారని, వాటి కింద అనేక కామెంట్స్ వస్తుంటాయని చెప్పారు. అయితే, తాను అసలు కామెంట్స్‌ను చదవనని సుప్రీత వెల్లడించారు. “నేను కామెంట్స్ చూడను. అందుకే నా అకౌంట్‌లో కూడా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి ఉంటుంది. మీకు ఏదైతే మానసిక ఒత్తిడిని కలిగిస్తుందో, మానసికంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో దానికి దూరంగా ఉండాలి” అని ఆమె బలంగా చెప్పారు. అనవసరంగా మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. గతంతో పోలిస్తే తన వ్యక్తిత్వంలో, మాట్లాడే తీరులో చాలా పరిణితి వచ్చిందని సుప్రీత అంగీకరించారు. ఇది జీవితంలో ఎదురైన కష్టాలు, దెబ్బల వల్ల వచ్చిందని వివరించారు. ముఖ్యంగా ఒక ఆరోగ్య సమస్య, ఇతర వ్యక్తిగత అనుభవాలు తనను ఈ విధంగా మార్చాయని ఆమె పేర్కొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అందరికీ సాధారణమేనని సుప్రీత అన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి, టాలీవుడ్ అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *