Winter Olympics 2026 : వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య..3 రోజుల్లోనే 10 వేల కండోమ్స్ ఖతం

Winter Olympics 2026 : వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య..3 రోజుల్లోనే 10 వేల కండోమ్స్ ఖతం


Winter Olympics 2026 : ఇటలీలోని మిలాన్ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో నిర్వాహకులకు ఒక వింత ఇబ్బంది వచ్చి పడింది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచిన కండోమ్స్ నిల్వలు నిండుకున్నాయి. సుమారు 2,900 మంది అథ్లెట్ల కోసం నిర్వాహకులు మొదట 10 వేల కండోమ్ ప్యాకెట్లను సరఫరా చేశారు. అయితే క్రీడలు ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే ఆ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో మరిన్ని కండోమ్స్ తెప్పించేందుకు అధికారులు హడావుడి పడుతున్నారు.

ప్యారిస్ కంటే ఇక్కడ తక్కువేనా?

సాధారణంగా ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో వేల సంఖ్యలో అథ్లెట్లు, సిబ్బంది వారాల తరబడి కలిసి ఉంటారు. ఈ సమయంలో సురక్షిత శృంగారం, లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్ల కోసం ఏకంగా 2 లక్షలకు పైగా కండోమ్స్ సరఫరా చేశారు. కానీ మిలాన్ నిర్వాహకులు కేవలం 10 వేలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అథ్లెట్ల డిమాండ్‌ను అంచనా వేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎందుకు అంత డిమాండ్?

ఒలింపిక్ విలేజ్ అనేది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు నివసించే తాత్కాలిక నివాసం. ఇక్కడ క్రీడాకారుల మధ్య సాన్నిహిత్యం పెరగడం సహజం. అసురక్షిత శృంగారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తితే అది క్రీడలపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తారు. అందుకే 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ సమయంలో కరోనా ఆంక్షల వల్ల కొంత కాలం ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

నిర్వాహకులు ఏమన్నారంటే

ప్రస్తుతం ఏర్పడిన కొరతను అధిగమించేందుకు వెంటనే అదనపు స్టాక్‌ను ఆర్డర్ చేసినట్లు ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఆటలు ముగిసే వరకు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం వీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మిలాన్‌లోని కోర్టినా డి అంపెజోలో ఉన్న క్రీడా గ్రామంలో వసతులు బాగున్నప్పటికీ, ఈ చిన్న పొరపాటు వల్ల వింటర్ ఒలింపిక్స్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. క్రీడాకారులు తమ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఇలాంటి పద్ధతులను అనుసరిస్తుంటారని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *