Smriti Mandhana : నీకెందుకు సామీ ఆ గొడవలు? పలాశ్ పై నోరు పారేసుకోవద్దని మంధాన స్నేహితుడికి కోర్టు వార్నింగ్

Smriti Mandhana : నీకెందుకు సామీ ఆ గొడవలు?  పలాశ్  పై నోరు పారేసుకోవద్దని మంధాన స్నేహితుడికి కోర్టు వార్నింగ్


Smriti Mandhana : ప్రముఖ సింగర్ పలాశ్ ముచ్చల్, టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానల మధ్య పెళ్లి రద్దు కావడం ఇప్పటికే పెద్ద చర్చకు దారితీయగా, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. స్మృతి మంధాన ఫ్రెండ్, ఫిల్మ్ మేకర్ విజ్ఞాన్ మానేపై బొంబాయి హైకోర్టు సీరియస్ అయ్యింది. పలాశ్ ముచ్చల్, అతని తల్లిపై తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని, వారిని కించపరిచేలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్, స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయ్యింది. ఈ ఘటన తర్వాత స్మృతి మంధాన చిన్నప్పటి స్నేహితుడు, ఫిల్మ్ మేకర్ విజ్ఞాన్ మానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలాశ్ ముచ్చల్, అతని తల్లిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. పలాశ్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని సినిమా పూర్తి చేయలేదని సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ పరిణామాలతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని పలాశ్ ముచ్చల్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ మిలింద్ జాదవ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. పలాశ్ ముచ్చల్, విజ్ఞాన్ మానే మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన వివాదం మాత్రమేనని, దానికి పాత పెళ్లి సంబంధాన్ని ముడిపెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇంటర్వ్యూ ట్రాన్స్‌క్రిప్ట్‌లను పరిశీలించిన కోర్టు.. విజ్ఞాన్ మానే వ్యాఖ్యలు ప్రాథమికంగా పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. పలాశ్ ముచ్చల్, అతని తల్లిపై ఎటువంటి ఆరోపణలు లేదా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని విజ్ఞాన్ మానేను కోర్టు ఆదేశించింది.

తనపై అవాస్తవ ఆరోపణలు చేసిన విజ్ఞాన్ మానేకు పలాశ్ ముచ్చల్ ఇప్పటికే రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేసిన పలాశ్.. కావాలనే తన కెరీర్, ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వివాదాలు పక్కన పెడితే.. పలాశ్ ప్రస్తుతం శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రలో నజరియా అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్మృతి మంధాన కూడా క్రికెట్ మైదానంలో మళ్లీ బిజీ అయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *