Sania Mirza: బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన సానియా మీర్జా.. ఆమె తాగే డ్రింక్ గురించి చెప్పేసిన టెన్నిస్ స్టార్‌‌

Sania Mirza: బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన సానియా మీర్జా.. ఆమె తాగే డ్రింక్ గురించి చెప్పేసిన టెన్నిస్ స్టార్‌‌


సాధారణంగా క్రీడాకారులు రిటైర్మెంట్ తర్వాత ఫిట్‌నెస్‌ను పక్కన పెడతారు. కానీ ఈ టెన్నిస్ సెన్సేషన్ మాత్రం మునుపటి కంటే ఇప్పుడు మరింత కాంతివంతంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన బిజీ షెడ్యూల్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా మెయింటైన్ చేస్తోంది? తన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న పది రకాల కోరియన్ పద్ధతులు ఏంటి? చర్మం, జుట్టు కోసం ఆమె ఉపయోగిస్తున్న ఆ వింత ‘రెడ్ లైట్ థెరపీ’ విశేషాలేంటి? టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వయంగా వెల్లడించిన తన లేటెస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ డైరీ ఇప్పుడొక సెన్సేషన్‌గా మారింది.

ఉదయాన్నే డ్రింక్ తో మొదలు..

సానియా మీర్జా తన రోజును భారీ బ్రేక్ ఫాస్ట్ తో కాకుండా ఒక ‘హెల్తీ షాట్’ తో ప్రారంభిస్తుంది. పసుపు, తేనె, నిమ్మరసం, అల్లం, కొన్ని నల్ల గింజలు (బ్లాక్ సీడ్స్) కలిపి తీసుకుంటుంది. “ఇది తాగడానికి అస్సలు రుచిగా ఉండదు కానీ శరీరానికి మాత్రం చాలా మేలు చేస్తుంది” అని సానియా పేర్కొంది. దీని తర్వాత నీటిలో నానబెట్టిన చియా విత్తనాలు, కాఫీ తీసుకుని జిమ్ కు వెళ్తుంది. ఉదయం పూట 3 నుంచి 4 కోడిగుడ్ల తెల్లసొన తీసుకోవడం ఆమెకు అలవాటు.

టెన్నిస్ ఆడుతున్నప్పుడు తన డైట్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో సానియా వివరించింది. “మునుపు ఆట కోసం నేను కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునేదాన్ని. ఇడ్లీలు, దోశలు ఇలా ప్రతిదీ తినేదాన్ని. కానీ ఇప్పుడు నా శారీరక శ్రమ 20 శాతానికి పడిపోయింది. అందుకే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను” అని సానియా చెప్పింది. ఇప్పుడు న్యూట్రిషనిస్టులు లేకపోయినా, తనే స్వయంగా తన ప్రోటీన్ ఇన్ టేక్ ను పర్యవేక్షించుకుంటోంది.

వర్కవుట్స్ లో మార్పులు..

సానియా వర్కవుట్ లో ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ తో పాటు అవుట్‌డోర్ రన్నింగ్ కు ప్రాధాన్యత ఇస్తోంది. సమయం తక్కువగా ఉండటం వల్ల పైలేట్స్ వంటి పద్ధతులను పక్కన పెట్టింది. వాతావరణం బాగున్నప్పుడు రోజుకు 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేయడం ఆమెకు ఇష్టం. ఈ జిమ్ ట్రైనింగ్, అవుట్‌డోర్ కార్డియో కలయిక వల్ల తన శరీరం దృఢంగా ఉండటమే కాకుండా ఎంతో ఉత్సాహంగా ఉంటుందని ఆమె నమ్ముతోంది.

కొరియన్ స్కిన్ కేర్..

సానియా మీర్జా తన అందం కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. “నేను ఉదయం 10 రకాలు, రాత్రి 10 రకాల కోరియన్ స్కిన్ కేర్ పద్ధతులను పాటిస్తాను. ఇది కొంచెం వింతగా అనిపించినా నా స్కిన్ కి మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది” అని ఆమె నవ్వుతూ చెప్పింది. అయితే ఇందులో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అనేవి తన ఫేవరెట్ అని, ఇవి గేమ్ చేంజర్స్ అని సానియా అభిప్రాయపడింది.

గడిచిన ఏడాది కాలంగా సానియా ‘రెడ్ లైట్ థెరపీ’ని తన దినచర్యలో చేర్చుకుంది. ఇది కేవలం చర్మం కోసమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆమె వెల్లడించింది. రోజు మార్చి రోజు అరగంట పాటు ఈ థెరపీ కింద కూర్చోవడం వల్ల చర్మం రీజువినేట్ అవుతుందని, ఎంతో కాంతివంతంగా మారుతుందని సానియా తన అనుభవాన్ని పంచుకుంది. సానియా మీర్జా ప్రయాణం చూస్తుంటే.. క్రమశిక్షణ అనేది కేవలం ఆటలోనే కాదు, జీవితంలోనూ ముఖ్యమని అర్థమవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆహారపు అలవాట్లను, వ్యాయామ పద్ధతులను మార్చుకుంటూ ఆమె అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *