శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు తక్కువే తీసుకుంటున్నారు.
సాయి పల్లవి రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. . నయనతార రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటుండగా సాయి పల్లవి రూ.12 కోట్లు తీసుకుంటుందా అని సినీ ప్రియులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రామాయణం చిత్రానికి రూ.10 కోట్లు తీసుకుంటుంది.
పరాశక్తి ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన శ్రీలీల, డి55లో రూ.3 కోట్లు తీసుకుంటుంది. డి55 సినిమాలో సాయి పల్లవికి ముఖ్యమైన పాత్ర ఉందని టాక్. శ్రీలీల సినిమాల్లో నటిస్తూనే మెడికల్ కాలేజీలో చదువుతోంది. ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ కొడుకు సరసన నటిస్తుంది. ఇవేకాకుండా తెలుగు, తమిళం భాషలలో సరైన అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది.




