Headlines

AP Budget 2026: ఏపీ బడ్జెట్‌లో ప్రజలకు శుభవార్త.. ఈ పథకాలకు ప్రత్యేక నిధులు..! ఏయే పథకాలంటే..?

AP Budget 2026: ఏపీ బడ్జెట్‌లో ప్రజలకు శుభవార్త.. ఈ పథకాలకు ప్రత్యేక నిధులు..! ఏయే పథకాలంటే..?


ఫిబ్రవరి 14న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపుదిద్దుకోగా.. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త పథకాలు కూడా ఈ బడ్జెట్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.3.35 లక్షల కోట్ల నుంచి రూ.3.48 లక్షల మంది బడ్జెట్ ఉండొచ్చని తెలుస్తోంది.

అమరావతికి భారీగా నిధులు

ఇప్పటికే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంంభమయ్యా. రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు పూర్తవ్వగా.. ఏయే శాఖకు ఎంత నిధులు కేటాయించాలనే దానిపై మంత్రులతో పయ్యావుల కేశవ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఏయే శాఖకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. అనంతరం శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది సమానంగా ఉండేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు సమాచారం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ సారి బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే పోలవరం, అమరావతికి భారీగా నిధులు సమకూర్చనున్నారు. ఇక రాయలసీమ-ఉత్తరాంధ్రలోని అభివృద్ది ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెద్ద మొత్తంలో ఉండనుంది.

పథకాలకు ప్రత్యేక నిధులు

ఇక ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. దీపం 2.0తో పాటు స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, మిగతా సంక్షేమ పథకాలకు భారీగా నిధులు మంజూరు చేయనున్నారు. అటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో నూతన రోడ్లు, రోడ్ల అభివృద్దిపై కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత హోలస్ రోడ్డకు నిధులు ఇవ్వనున్నారని సమాచారం. ఇక హార్టికల్చర్, లాజిస్టిక్స్ సెక్టార్ అభివృద్దికి ప్రత్యేక నిధులు ఉండనున్నాయి. అటు జల జీవన్ మిషన్ పథకానికి కూడా ప్రత్యేక నిధులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కాగా బడ్జెట్ కసరత్తుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో చర్చలు జరిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించారు. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతో బడ్జెట్‌లో అభివృద్ది పనులకు భారీగా నిధులు ఉండనున్నాయని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *