Chanakya Niti: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!


Chanakya Niti: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!

చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యనిపుణుడు. ఆయన రచించిన అర్థశాస్త్రం, నీతి శాస్త్రం గ్రంథాలలో జీవన విధానం, కుటుంబ విలువలు, భార్యాభర్తల సంబంధాలు వంటి అనేక విషయాలపై మార్గదర్శక సూచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు నేటికీ చాలా మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. చాణక్యుడు భార్యాభర్తలను కుటుంబమనే ప్రపంచ రథానికి రెండు చక్రాలతో పోల్చాడు. ఈ రెండు చక్రాలు సమానంగా, సమన్వయంతో ముందుకు సాగితేనే రథం సాఫీగా నడుస్తుంది. ఒకటి వెనుకబడినా లేదా దారి తప్పినా, రథం ఆగిపోతుంది. అదే విధంగా, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, నమ్మకం, సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

భార్యను అవమానించడం

తన భార్యను పదే పదే అవమానించే వ్యక్తి తన జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టుకుంటాడని చాణక్యుడు హెచ్చరిస్తాడు. కుటుంబం కోసం సంపాదించడం మాత్రమే పురుషుడి బాధ్యత కాదు.. కుటుంబ సభ్యులను గౌరవించడం కూడా. కుటుంబాన్ని నిలబెట్టడంలో స్త్రీ పాత్ర కూడా సమానంగా, కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భార్యను గౌరవించడం, ఆమె భావాలను అర్థం చేసుకోవడం అవసరం.

ఇతర స్త్రీల పట్ల ఆకర్షణ

ఇంట్లో భార్య ఉన్నప్పటికీ.. మరొక స్త్రీ పట్ల ఆకర్షితుడవడం కుటుంబ జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతుందని చాణక్యుడు హెచ్చరించాడు. అలాంటి ప్రవర్తన నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. దాంపత్య బంధాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి పురుషులు అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తాడు.

భార్య అభిప్రాయాన్ని అగౌరవపరచడం

భార్య అభిప్రాయాన్ని తక్కువ చేసి చూడకూడదని, ఆమె మాటకు విలువ ఇవ్వాలని చాణక్యుడు చెప్పాడు. ఒకరినొకరు గౌరవించుకునే కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. లేకపోతే ఇంటి వాతావరణం కలతలతో నిండిపోతుంది. సారాంశంగా, దాంపత్య జీవితం పరస్పర గౌరవం, నమ్మకం, సమన్వయం మీద నిలబడిన బంధం అని ఆచార్య చాణక్యుడి బోధనలు సూచిస్తున్నాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *