Nizamabad Corporation Result : నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..

Nizamabad Corporation Result : నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ హవా కొనసాగిందనే చెప్పాలి.

ఇక, నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
బోధన్ మున్సిపాలిటీ(38)లో కాంగ్రెస్ పార్టీ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు.
ఆర్మూర్ మున్సిపాలిటీ(36)లో కాంగ్రెస్ పార్టీ 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.
భీమ్‌గల్ మున్సిపాలిటీ(12)లో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి.

ఇక నిజామాబాద్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీలో పోరు ఆసక్తికరంగా ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. అయితే, ఫలితాల సరళిని బట్టి చూస్తే.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా, ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సమయానికి 60 స్థానాలున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు స్థానాల్లో గెలుపొంది బీజేపీ బోణీ కొట్టింది. పూర్తి ఫలితాలు వెలవడేందుకు మరింత సమయం పట్టవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *