Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..

Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..


తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.. కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడగా.. మరికొన్ని ప్రాంతాల్లో వెలువడాల్సి ఉంది.. తెలంగాణ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. పలు చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుండగా.. బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. చాలా మునిసిపాలిటిల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి నెలకొంది. అంతేకాకుండా.. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడటం ఉత్కంఠ రేపుతోంది.. తెలంగాణ మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 9 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది..

ఈ మున్సిపాలిటీల్లో హంగ్..

జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత‌, జనగామ, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఈ మునిసిపల్స్ లో స్వతంత్రులు కీలకం కానున్నారు. అంతేకాకుండా.. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో ఒక్క ఓటుతో మూడో వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.

జనగామ మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ..

జనగామలో మొత్తం 30 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 12 వార్డుల్లో విజయం సాధించాయి.. నాలుగు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందారు. మరోచోట సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానుండటంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్ 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్ టీవీ 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *