టాలీవుడ్‌కు దూరమై 14ఏళ్లు.. ఇప్పటికీ అదే అందం.. అదే క్రేజ్.. 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

టాలీవుడ్‌కు దూరమై 14ఏళ్లు.. ఇప్పటికీ అదే అందం.. అదే క్రేజ్.. 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే


ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నాడు స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ప్రస్తతం విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తున్నాడు పూరి. ఈ సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో 143 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. 2004 విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. బ్రహ్మానందం , బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్‌కు జోడీగా నటించిన కథానాయకి మీకు గుర్తుందా..?

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

తను ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది.? తెలుసుకుందాం.? ఆ హీరోయిన్ పేరు సమీక్ష సింగ్. తను తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. అంతే కాదు.. చాలా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. సమీక్ష సింగ్ ఫస్ట్ మూవీ 143నే. ఈ సినిమా తర్వాత ఈ భామ వరస సినిమాలు చేసింది. అరింతుమ్ అరియమలుమ్‌ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టింది. 143 సినిమా తర్వాత కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి తెలుగు సినిమాల్లో పాత్రలు పోషించింది. అలాగే పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

2012లో చివరిగా తెలుగులో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమై 14ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 2020లో, సింగపూర్‌లో సింగర్ షేల్ ఓస్వాల్‌ని సమీక్షసింగ్ మ్యారేజ్ చేసుకుంది. భర్తతో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాను ప్రొడ్యూస్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టవ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *