భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ


పెళ్లై పిల్లాడు పుట్టాక ఓ మహిళ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయిందని భావించారు. ముఖ్యంగా ఆమెను హత్య చేశారన్న ఆరోపణలతో కన్నవారిపైనే కేసులు నమోదు అయ్యాయి. వారిప్పటికీ జనం దృష్టిలో హంతకులనే నింద మోస్తూనే ఉన్నారు. కానీ కనిపించకుండా పోయిన మహిళ భర్త ఫోన్‌కు తాజాగా వచ్చిన ఒక చిన్న ఆధార్ ఓటీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. చనిపోయిందనుకున్న మహిళ ప్రాణాలతో ఉండటమే కాకుండా.. మరో వ్యక్తితో కలిసి కొత్త జీవితాన్ని గడుపుతున్నట్లు వెలుగులోకి తెచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సందీప్ కుమార్‌కు, ప్రియాంక కు 2017లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైన ఏడేళ్ల తర్వాత 2024లో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రియాంక నగలతో సహా కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ కాసేపు ఉన్న ఆమె అక్కడి నుంచి కూడా అదృశ్యం అయింది. అయితే తన భార్య, కుమారుడు ఏమయ్యారో తెలియక సందీప్ ఆందోళన చెందాడు. వెంటనే అత్తారింటికి వెళ్లి ఆరా తీశాడు. ప్రియాంక తండ్రి ఆమెను చంపి సరయూ నదిలో పడేశాడని కొందరు స్థానికులు చెప్పడంతో.. సందీప్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కన్నకూతురిని చంపారన్న నిందతో ఆ కుటుంబం రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తూనే వస్తోంది. కోర్టు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూనే వస్తోంది. అయితే.. పుట్టింటి నుంచి కుమారుడితో సహా వెళ్లిపోయిన ప్రియాంక మొదట ఆత్మహత్య చేసుకోవాలని భావించినా.. ఆ తర్వాత మనసు మార్చుకుని అయోధ్యకు చేరుకుంది. అక్కడే ఆమెకు రాజస్థాన్‌కు చెందిన మంగళ్ చంద్ర అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె అతడితో పాటు రాజస్థాన్‌కు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించింది. హాయిగా భర్త, కుమారుడితో కలిసి జీవిస్తోంది. రెండు సంవత్సరాలుగా ప్రియాంక ఆమె కుమారుడికి ఏమైందో తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ప్రియాంక తన ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించగా.. ఆ సమయంలో ఆమె పాత మొబైల్ నంబర్ , ప్రస్తుతం భర్త సందీప్ వద్ద ఉన్న ఫోన్‌కు ఒక ఓటీపీ మెసేజ్ వచ్చింది. లోకేషన్ ఆధారంగా రాజస్థాన్ వెళ్లిన పోలీసులు.. అక్కడ ప్రియాంక మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుమారుడితో సహా హాయిగా ఉండడం చూసి షాకయ్యారు. కానీ వెంటనే ఆమెను బస్తీ జిల్లాకు తీసుకువచ్చారు. భర్త ఎదుటే ఆమెను విచారించగా.. అసలు విషయాలన్నీ ఒప్పుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులపై ఉన్న హత్య ఆరోపణలు తొలగిపోయాయి. అయితే కన్నకూతురు చేసిన పనికి అవమాన భారంతో ఆమె కుటుంబం ఆమెను దూరం పెట్టగా.. భర్త సందీప్ మాత్రం తన కుమారుడి కస్టడీ కోసం న్యాయ పోరాటం మొదలు పెట్టాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

ఎలుగుబంట్ల బీభత్సం.. వణికిపోతున్న గ్రామ ప్రజలు

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *