తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరా హోరి పొరు కొనసాగుతోంది.. పలు ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో కొనసాగుతోంది.. అయితే.. మొదటి ఫలితం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణి కొట్టింది. గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.. 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపొందగా.. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ ముందంజలో ఉన్నాయి..
తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.
116 మున్సిపాలిటీలు – 2581 వార్డులు..
కాంగ్రెస్ – 145
బీఆర్ఎస్ -71
బీజేపీ – 17
ఇతరులు – 15
7 కార్పొరేషన్లు – 414 వార్డులు
కాంగ్రెస్ – 2
బీఆర్ఎస్ – 0
బీజేపీ – 0
ఇతరులు – 0
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026
తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్ టీవీ