Ram Charan: రామ్ చరణ్-ఉపాసన కవల పిల్లలకు నామకరణ మహోత్సవం! ఏం పేర్లు పెట్టారో తెలుసా?

Ram Charan: రామ్ చరణ్-ఉపాసన కవల పిల్లలకు నామకరణ మహోత్సవం! ఏం పేర్లు పెట్టారో తెలుసా?


మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన మగ బిడ్డ, ఆడ బిడ్డలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివెరిసింది. ఇక ఈ శుభవార్త విన్న తర్వాత అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలోహాస్పిటల్‌ వద్దకు వేలాది సంఖ్యలో వచ్చి రామ్ చరణ్- ఉపసాన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఉపాసన తన కవల పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు సంప్రదాయంగా నామకరణ మహోత్సవం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.పండితుల సూచలు, సలహాలతో కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్- ఉపాసనల కవల పిల్లల పేర్లు ఇవే నంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

పిల్లల జాతకం, జన్మనక్షత్రాల ప్రకారం కూతురికి అన్వీరా దేవీ, కుమారుడికి శివరామ్ అని పేర్లు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అని వస్తోంది. అలాగే చిరంజీవి అసలు పేరు లోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ ను తీసుకుని కుమారుడికి శివ రామ్ అని నామకరణం చేసినట్లు టాక్. ప్రస్తుతం మెగాభిమానులు ఈ పోస్టులను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ పేర్లను మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ కవల పిల్లల పేర్లు ఇవేనా?

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్ర పోషించనున్నారు. వీరితో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ నటుడు దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 26న విడుదల కావాల్సిన పెద్ది మూవీ వివిధ కారణాలతో అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *