15వ రోజూ రాత్రి ఈ వేడకలు ఘనంగా జరగనున్నాయి రాత్రంతా జరిగే వేడుకలు భక్తి, సంగీతం, ధ్యానం కలిసి భక్తులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకు పైగా ప్రేక్షకులు 100కి పైగా టీవీ ఛానెళ్లు, డిజిటల్ స్ట్రీమ్‌ల ద్వారా 23 భారతీయ, విదేశీ భాషల్లో ఈ వేడుకలకు సంబంధించిన లైవ్ స్ట్రిమింగ్ జరగనుంది.
ఈ వేడుకలు ధ్యానలింగంలో పంచభూత క్రియతో ప్రారంభం కానున్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూలకాలను గౌరవించే శక్తివంతమైన శుద్ధీకరణ ఆచారం ఇది. ఆ తర్వాత లింగ భైరవి మహా యాత్ర, దివ్య స్త్రీ శక్తిని జరుపుకునే గొప్ప ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు ఆరోజు రాత్రంతా వివిధ సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.
మహాశివరాత్రికి ముందు ఈషా యొక్క ఉత్సాహవంతమైన భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య ఉత్సవం ఘనంగా జరుగు జరుగుతుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12 సిక్కిల్ గురుచరణ్, 13న రాహుల్ దేశ్‌పాండే సంగీతం, 14న మీనాక్షి శ్రీనివాసన్ భరతనాట్యం ప్రోగ్రామ్స్ జరగనున్నాయి.
ఈ సంవత్సరం మొదటిసారిగా సద్గురు స్వయంగా యోగేశ్వర లింగ మహా అభిషేకం నిర్వహించనున్నారు. ఈ పవిత్ర జీవ శక్తి రూపంతో అనుసంధానం కావడానికి ప్రపంచవ్యాప్త భక్తులకు ఉంచితంగా అవకాశం కల్పించనున్నారు.
మరిన్ని అథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.