బ్లడ్ చాలా తక్కువగా ఉన్న వారు జామకాయ, అరటి పండును తీసుకోండి. దీని వలన రక్తం బాగా పెరుగుతుంది. వీటిని ఉదయం పూట తీసుకుంటే చాలా మంచిది.
రోజూ రాత్రి పూట భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి. ఇలా మీరు 15 రోజుల పాటు తింటే రక్తం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.
మన భోజనంలో పెరుగు తప్పకుండా ఉంటుంది. అయితే, రక్తం తక్కువగా ఉన్న వారు పెరుగును కాకుండా మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగండి. దీని వలన రక్తం పెరుగుతుంది. రక్త హీనత సమస్యల నుంచి కూడా బయటపడతారు.
ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దానిమ్మ కాయలను తింటే రక్తం బాగా పెరుగుతుంది. రక్త హీనత వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఇలా ట్రై చేసి చూడండి.
ఎప్పుడూ నాన్ వెజ్ కాకుండా ఆకు కూరలు కూడా తినండి. ఇది రక్త హీనత సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే, వాటిలో పాల కూరను తింటే రక్తం పెరుగుతుంది. కాబట్టి, దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.




