OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మళయాళం లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మళయాళం లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ


ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఈ వారంలో ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు లాంటి సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అలా గురువారం (ఫిబ్రవరి 12) కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అదిరే ట్విస్ట్ లతో, ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో సాగే ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మూడు రోజుల వయసున్న పసికందు మిస్సింగ్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతోంది. తిరువనంతపురంలోని గుడ్ షెపర్డ్ హాస్పిటల్ నుంచి ఓ పసి బిడ్డ అదృశ్యమవుతుంది. ఈ మిస్సింగ్ కేసు ను ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. అదే ఆస్పత్రిలో సనల్ మాథ్యూ అని ఒక అటెండర్ ఉంటాడు. యాదృచ్ఛికంగా పాప కనిపించకుండా పోయిన రోజు సనల్ ఆలస్యంగా డ్యూటీకి వస్తాడు. దీంతో పాప మిస్సింగ్ కేసులో సనల్ ను అనుమానిస్తారు పోలీసులు. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి పాపను తీసుకుని వెళ్లడం తాను చూశానని సనల్ చెప్తాడు. తన మీద పడ్డ నిందను పోగొట్టుకునేందుకు స్వయంగా అతనే పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు.

మరోవైపు ఈ మిస్సింగ్ బేబీ పేరెంట్స్ కేవలం 19 ఏళ్లే ఉంటాయి. ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా అని వారు భయపడుతుంటారు. మరి హాస్పిటల్ నుంచి పాపను ఎవరు తీసుకెళ్లారు? తన మీద పడ్డ నిందను తొలగించుకునేందుకు సనల్ ఏం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అరుణ్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్, అభిమన్యు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. . రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ గర్ల్ సినిమా ఓవరాల్ గా మంచి కలెక్షన్లు సాధించింది. 24 గంటల వ్యవధిలో స్పీడ్ గా సాగే ఈ కథనం సినిమాకు హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఓటీటీలో మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి బేబీ గర్ల్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *