Team India: సింహాన్ని అడవిలో కొడితేనే కిక్కబ్బా.. రాసిపెట్టుకోండి.! అప్పుడు టీ20 ప్రపంచకప్ మనదే

Team India: సింహాన్ని అడవిలో కొడితేనే కిక్కబ్బా.. రాసిపెట్టుకోండి.! అప్పుడు టీ20 ప్రపంచకప్ మనదే


వెస్టిండీస్ మాజీ కెప్టెన్, కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవాలనుకునే ఏ జట్టు అయినా ముందుగా ఆతిథ్య భారత్‌ను ఓడించాల్సిందేనని అతడు స్పష్టం చేశాడు. 2016లో భారత్‌ను ఓడించి వెస్టిండీస్ టైటిల్ గెలిచిందని గుర్తు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్‌కు రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను అందించిన మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవాలని ఆశించే ఏ జట్టు అయినా ముందుగా ఆతిథ్య భారత్‌ను ఓడించాల్సిందేనని అతడు స్పష్టం చేశాడు.

భారత్‌ను దాటకుండా ఈ ప్రపంచకప్‌ను ఎవరూ గెలవలేరని సామీ తేల్చి చెప్పాడు. 2016లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచినప్పుడు కూడా సెమీఫైనల్‌లో భారత్‌ను ఓడించాల్సి వచ్చిందని సామీ గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో తాను కెప్టెన్‌గా వ్యవహరించగా, ఇప్పుడు కోచ్‌గా ఉన్నప్పటికీ భారత్‌ను ఓడించాలనే నమ్మకం మారలేదని అతడు పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం భారత్ ఆడుతున్న దూకుడును పరిగణనలోకి తీసుకుంటే ఈ సవాల్ మరింత పెద్దదిగా కనిపిస్తోందని డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. కాగా, వెస్టిండిస్ జట్టు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ రెండింటిలోనూ గెలిచి.. గ్రూప్ సీలో నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *