India vs Namibia, 18th Match, Group A, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 18వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ వర్సెస్ నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈక్రమంలో టాస్ గెలిచిన నమీబియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ, మహమ్మద్ సిరాజ్ ఆడటం లేదు. సంజు సామ్సన్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చారు.
5 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. చివరిసారిగా 2021 టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.
తొలి మ్యాచ్‌లో భారత్ అమెరికాను ఓడించగా, నమీబియా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఈరోజు గెలిస్తే భారత్ గ్రూప్ ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. నమీబియా కూడా ఈ విజయంతో 2వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ 4 పాయింట్లతో 1వ స్థానంలో ఉంది.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
నమీబియా (ప్లేయింగ్ XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.