మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబుకు సిటీ సివిల్ కోర్ట్ బిగ్‌షాక్ ఇచ్చింది. 2023లో సంక్రాంతి సంబరాల్లో లక్కీడ్రా పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయనపై నమోదైన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బెయిల్‌పై విడుదలవుతారనుకున్న అంబటి రాంబాబు కోర్టు నుంచి మళ్లీ రాజమండ్రి జైలుకే వెళ్లాల్సి వచ్చింది. కోర్టు తీర్పులో ఈ నెల 26 వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు.
అయితే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో, పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో ఇప్పటికే అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. దీంతో ఆ బెయిల్ పత్రాలను తీసుకుని లాయర్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇంతలో 2023లో సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో గతంలో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పీటీ వారెంట్‌తో జైలులో ఉన్న అంబటిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదిలా ఉండగా అంబటి రాంబాబుపై 35 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయన ఈ కేసుల్ని క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వరుస పీటీ వారెంట్‌లు ఆయనకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.