పప్పులోకి పుల్లటి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అయితే, కొందరు చింతకాయ, మామిడి కాయ వేసుకుని తింటారు. కానీ, వాటితో పాటు ఉసిరి కాయను కూడా పప్పులో వేసుకుని తింటే రుచి కరంగా ఉంటుంది.
కావల్సిన పదార్ధాలు: ఉసిరికాయలు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కందిపప్పు, 3 టేబుల్ స్పూన్స్ నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి.
ముందుగా కందిపప్పును తీసుకుని నీటితో కడిగి శుభ్రం చేసి దానిలో నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు అలాగే, ఉసిరికాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో మొత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇక ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు బాగా వేయించాలి. ఉసిరి ముక్కలకు కొంచం, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయండి.
ఇక చివర్లో ఉడికించిన పప్పును, ఉసిరికాయలను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిని అలాగే కొద్దీ నిమిషాలు ఉడక పెడితే ఉసిరికాయ పప్పు రెడీ అవుతుంది. ఇక వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినడమే.




