Headlines

Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా

Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా


అల్లు అర్జున్ మీద నెగిటివిటీ మొదలైందా..? ఆయన ఎదుగుతున్న విధానం చూసి కావాలనే బ్యాడ్ చేయాలని చూస్తున్నారా..? పుష్ప 2 తర్వాత ఇండియా వైడ్‌గా బన్నీ ఎదిగిన విధానాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారా.. ఆయనపై టాలీవుడ్‌లో కుట్ర జరుగుతుందా లేదంటే బాలీవుడ్ టార్గెట్ చేసిందా..? ఈ కండీషన్ల కథేంటి..? అల్లు అర్జున్.. ఇప్పుడు ఇది పేరు కాదు ఓ బ్రాండ్. పుష్పకు ముందు AA అనేది తెలుగులోనే ఫేమస్.. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా వైడ్‌గా పాపులర్. బన్నీ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ కూడా ఉలిక్కిపడుతుంది. ఈ హీరో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా పిచ్చెక్కిస్తుంది. ఈ ఎదుగుదలపైనే కుట్రలు మొదలయ్యాయనే టాక్ ఇండస్ట్రీలో మొదలైందిప్పుడు. అల్లు అర్జున్‌ను కలవాలన్నా లేదా ఆయనతో పని చేయాలన్నా 42 కండీషన్స్ ఉన్నాయని.. ఐ టూ ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, హ్యాండ్‌షేక్స్ ఉండవు, ఫోన్‌లు అనుమతించరు లాంటివి ఉన్నాయంటూ ప్రచారం జోరుగా షురూ అయింది. సోషల్ మీడియాలో దీన్ని మరింత వేగంగా వైరల్ చేస్తున్నారు కొందరు. దాంతో వెంటనే స్పందించింది బన్నీ టీం. అల్లు అర్జున్ మీద జరుగుతున్నదంతా అబద్ధపు ప్రచారమే అని.. ఆయన్ని కలవడానికి అలాంటి కఠినమైన ప్రోటోకాల్ ఏం లేదంటూ అల్లు అర్జున్ టీం నుంచి అధికారికంగా లేఖ విడుదలైంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్లపై లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందంటూ వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. బన్నీ క్రేజ్ చూసి.. ఇతర ఇండస్ట్రీల నుంచే ఈ నెగిటివిటీ వస్తుందంటూ మండి పడుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్యే ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరపడంతో పాటు రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటుకు రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్‌ను డిస్టర్బ్ చేస్తుంది. మొత్తానికి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??

కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే

ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్

దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *