BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్.. భారత్, పాక్ మ్యాచ్‌కు పెద్ద ప్లాన్‌తోనే శ్రీలంకకు

BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్.. భారత్, పాక్ మ్యాచ్‌కు పెద్ద ప్లాన్‌తోనే శ్రీలంకకు


BCB chief Aminul Islam set to meet BCCI officials: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం ఆదివారం కొలంబోలో జరగనున్న భారత్ – పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఐసీసీ శ్రీలంకలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఉద్రిక్తతల తర్వాత బీసీసీఐతో సంబంధాలను మెరుగుపర్చడానికి ఈ సమావేశం సహాయపడుతుందని ఆయన ఆశిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథమ్ అలోతో అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ , మార్క్యూ మ్యాచ్ కోసం ఆహ్వానం ఐసీసీ నుంచి వచ్చింది. కీలకమైన ఆసియా వాటాదారులను ఒకచోట చేర్చే విస్తృత ప్రణాళికలో ఇది ఒక భాగమని’ అన్నారు.

“ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఐసీసీలో ప్రధాన వాటాదారులైన ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం అందింది. 15వ తేదీన జరిగే భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ కోసం, ఐదు ఆసియా దేశాల ప్రతినిధులు హాజరు కావాలని, మ్యాచ్‌ను కలిసి చూడాలని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఐసీసీ కోరుకుంటుంది” అని ఇస్లాం తెలిపారు.

ఐసీసీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆసియా కూటమిని ఏర్పరుస్తాయని ఆయన అన్నారు.

ఈ సమావేశం బీసీసీఐతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “మీరు దీనిని అలాంటిదిగానే పరిగణించవచ్చు” అంటూ బదులిచ్చారు.

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఐపీఎల్ ఒప్పందం నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించిన తర్వాత, ఈ రెండు బోర్డుల మధ్య సంబంధాలు క్షీణించాయి.

భద్రతా సమస్యలను పేర్కొంటూ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం భారతదేశానికి తమ జట్టును పంపడానికి నిరాకరించింది. అయితే, మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఐసీసీ, ఓ సమీక్ష తర్వాత బీసీబీ అభ్యంతరాలను తప్పికొట్టింది. ముప్పు లేదంటూ ఐసీసీ చెప్పుకొచ్చింది.

సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ బంగ్లాదేశ్ తన స్థానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకపోవడంతో, ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లో చేర్చింది.

ఈ ఎపిసోడ్ స్వల్ప దౌత్యపరమైన అలజడికి దారితీసింది. పాకిస్తాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పిలుపును ఉపసంహరించుకోవాలని బీసీబీ, శ్రీలంక ప్రభుత్వం ఒప్పించిన తర్వాత పరిస్థితి చివరికి అదుపులోకి వచ్చింది. బీసీబీ ఇప్పుడు అధికారిక రక్షణలను కోరుకుంటున్నట్లు ఇస్లాం తెలిపారు.

“మేం కూడా ఒక ఒప్పందం కుదుర్చుకుంటాం. ఈ ఒప్పందం తర్వాత ఎటువంటి అనిశ్చితి ఉండదు, ఐసీసీతో ఇలాంటి చర్చలు (ఎంఓయును సిద్ధం చేయడం గురించి) దాదాపుగా ఖరారు అయ్యాయి” అని ఆయన అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *