ఫోన్ అస్సలు చూడకండి: ఉదయం నిద్రలేవగానే ఫోన్ అసలు అస్సలు చూడకండి, దీని వలన ఆలోచనలు మారే అవకాశం ఉంది. నిద్ర నుంచి మేల్కొగానే కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా ఉండండి. దీని వలన మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది.
మంచి నీళ్ళు ఇలా తాగండి: ఉదయం లేవగానే మంచి నీళ్ళను స్పీడ్ గా తాగకండి. నీటిని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగడం వలన పని ఒత్తిడి తగ్గి కొత్త పనుల గురించి ఆలోచించేలా చేస్తుంది. అంతేకాదు, మీ శరీరం కూడా రిలాక్స్ అవుతుంది.
సెల్ఫ్ లవ్: ఎవరో మీ వైపు చూడాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఇష్ట పడాలని అనుకోవద్దు. మిమల్ని మీరే ప్రేమించుకోవాలి. అప్పుడే మీ మీద మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యం.
పాటలు వినడం: ఖాళీ సమయంలో మీతో మీరు గడపండి. ఆ సమయంలో నచ్చిన పాటలను పాడుతూ ఉండండి. వీటిని హమ్ చేసినప్పుడు మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. అలాగే పడుకునే ముందు ఈ రోజు చేసిన విషయాల్లో ఒక దాని గురించి తలచుకుని పడుకోండి.
ఏకాగ్రత: మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మీదే ధ్యాస పెట్టాలి. వేరే వాటి గురించి ఆలోచించవద్దు. ఇలా చేస్తే పనులు పెండింగ్ లో పడతాయి. పని విషయంలో ఏకాగ్రత చాలా ముఖ్యం.




