నా గర్భాశయాన్ని ‍తీసివేయించాడు.. స్టార్ సింగర్ పై మాజీ భార్య ఫిర్యాదు

నా గర్భాశయాన్ని ‍తీసివేయించాడు.. స్టార్ సింగర్ పై మాజీ భార్య ఫిర్యాదు


సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఈ మధ్య తెగ వినిపిస్తున్నాయి. సెలబ్రెటీల పెళ్లిళ వార్తలు ఓ వైపు వైరల్ అవుతుంటే.. అంతకు మించి వారి విడాకుల వార్తలు ఎక్కువవుతున్నాయి. ఎవరు, ఎప్పుడు విడిపోతున్నట్టు అనౌన్స్ చేస్తారో తెలియడం లేదు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు విడాకులు అంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది సెలబ్రెటీలు పెళ్లి, విడాకుల విషయాల్లో పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ సింగర్ పై ఆయన మాజీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గర్భాశయాన్ని ‍తీసివేయించాడు అంటూ కేసు పెట్టింది ఆమె.. ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు ఉదిత్ నారాయణ్. ఈ మధ్యకాలంలో ఉదిత్ నారాయణ్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

ఆమధ్య తన మ్యూజిక్ కన్సర్ట్ కు హాజరైన మహిళా అభిమానులను అతను ముద్దు పెట్టుకోవడం తీవ్ర వివాదాస్పమైంది. చాలామంది ఈ స్టార్ సింగర్ ప్రవర్తనా తీరును తప్పు పట్టారు. తాజాగా ఉదిత్ పై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది మరెవరో కాదు, ఆయన మాజీ భార్య రంజనా ఝా. బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది ఆమె.  1996లో హెల్త్‌ చెకప్‌ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, అక్కడ తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది.

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

అయితే తనను ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసిందే.. అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ఈ విషయం బయటపడిందని.. కావాలనే తన పై కుట్ర చేశారని కన్నీళ్లు పెట్టుకుంది రంజనా. గతంలోనూ ఆమె పలుసార్లు ఉదిత్ పై ఆరోపణలు , పోలీస్ కేసులు వేసింది. కాగా విడాకుల సమయంలో ఉదిత్ రంజనాకు భరణం కూడా ఇచ్చారు. ఉదిత్ రంజనాకు నెలకు 15 వేల రూపాయలు ఇచ్చేవారట. 2021లో దానిని 25 వేల రూపాయలకు పెంచారట. ఇది కాకుండా, ఉదిత్ రంజనాకు రూ.1 కోటి విలువైన భూమి, ఇంటిని ఇచ్చారట. 25 లక్షల విలువైన ఆభరణాలను కూడా ఇచ్చారట. అయితే రంజనా దానిని అమ్మేసిందని గతంలో ఉదిత్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *