Sanju Samson : కొట్టిన రన్స్‌ కంటే కప్పులే ఎక్కువ..టీమిండియా స్టార్ గురించి ఈ నిజం తెలుసా?

Sanju Samson : కొట్టిన రన్స్‌ కంటే కప్పులే ఎక్కువ..టీమిండియా స్టార్ గురించి ఈ నిజం తెలుసా?


Sanju Samson : టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. అయితే, టీమిండియాలో ఒక స్టార్ ఆటగాడి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధించిన పరుగులు సున్నా.. కానీ అప్పుడే ఒక వరల్డ్ కప్ మెడల్ మెడలో ఉంది.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026లో కూడా ఆయన స్క్వాడ్‌లో ఉన్నాడు. ఒకవేళ భారత్ ఈసారి కూడా కప్పు కొడితే, సంజూ ఖాతాలో పరుగులు లేకపోయినా రెండు ప్రపంచకప్ టైటిల్స్ చేరడం ఖాయం.

టీమిండియాలో సంజూ శామ్సన్ అత్యంత టాలెంటెడ్ ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ ప్రపంచకప్ విషయానికి వస్తే ఆయన కథ చాలా విభిన్నంగా ఉంటుంది. 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో సంజూ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, టోర్నీ ఆద్యంతం రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం, టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో సంజూకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో ఒక్క రన్ కూడా చేయకుండానే ఆయన ప్రపంచ విజేతగా నిలిచాడు.

ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సంజూ శామ్సన్ భారత జట్టులో ఉన్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆయనకు ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. అంటే ఇప్పటికీ ప్రపంచకప్‌లో ఆయన పరుగులు సున్నాగానే ఉన్నాయి. ఒకవేళ భారత్ ఈసారి కూడా విజేతగా నిలిచి, సంజూకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోతే.. ఆయన ఖాతాలో రెండు ప్రపంచకప్ మెడల్స్ ఉంటాయి కానీ, పరుగులు మాత్రం ఉండవు. ఇది క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, వింతైన రికార్డుగా మిగిలిపోతుంది.

అయితే సంజూ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో సంజూ శామ్సన్ బరిలోకి దిగే అవకాశం మెండుగా ఉంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరి, బుధవారమే డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో నమీబియా మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అదే జరిగితే, సంజూ శామ్సన్ ఓపెనర్‌గా లేదా మిడిలార్డర్‌లో టీ20 ప్రపంచకప్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం జట్టులో కొన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తున్నాడు. నమీబియా బలహీనమైన జట్టు కావడంతో, బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. అభిషేక్ అందుబాటులో లేకపోతే సంజూ శామ్సన్ తన బ్యాట్ కు పని చెప్పడం ఖాయం. ఒకవేళ ఈ మ్యాచ్ లో సంజూ ఆడి పరుగులు సాధిస్తే, రన్స్ కంటే కప్పులే ఎక్కువ అనే వింత రికార్డుకు తెరపడే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *