
ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా హిట్టయిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఈ మధ్యన కన్నడలోనూ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. తెలుగు తదితర భాషల్లోనూ వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అయ్యన మానే’, ‘శోధ’, ‘మారిగల్లు’ వంటి కన్నడ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించే..