పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. మార్కెట్ రేంజ్ కూడా ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు బన్నీతో సినిమా చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఐకాన్ స్టార్ లెవెల్ ఏంటో. అయితే ఈ మధ్యన బన్నీపై ఓ వర్గం పని గట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ స్టార్ హీరో గురించి లేని పోని రూమర్లు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ మేనేజర్ కావేరీ బరువా.. అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బన్నీని కలవాలంటే 42 కండిషన్లు ఉంటాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇట్టే ట్రెండ్ కావడంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే రియాక్ట్ అయ్యింది. బన్నీ గురించి సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోన్న వ్యాఖ్యలు నమ్మవద్దంటూ అభిమానులకు సూచించింది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప, పుష్ప 2 సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు రాజశేఖర్ అనింగి ఓ వీడియోను రిలీజ్ చేశారు. బన్నీపై జరుగుతోన్న దుష్ప్రచారం ఖండించాడు. అలాగే సినిమా సెట్ లో అతను ఎలా ఉంటాడు, అతని వ్యక్తిత్వమేంటో ఈ వీడియోలో చెప్పుకొచ్చారీ సీనియర్ నటుడు.
‘నేను పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ గారితో కలిసి నాలుగేళ్ల పాటు పనిచేశాను. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ అని కూడా చూడకుండా ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదు. షూటింగ్ విరామ సమయంలో ప్రొడక్షన్ బాయ్స్ స్నాక్స్ పట్టుకొచ్చినప్పుడు, మాలాంటి ఆర్టిస్టులకు అసిస్టెంట్లు ఉంటారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా వెళ్లి ఆ బేసిన్ లో నుంచే స్పాట్ బాయ్స్‌తో కలిసి స్నాక్స్ తింటారు. అంతటి నిరాడంబరమైన వ్యక్తి కళ్ళలోకి చూడొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు అని రూల్స్ పెడతారంటే ఎవరూ నమ్మరు. అల్లు అర్జున్ సెట్‌లోకి రాగానే ప్రతి చిన్న టెక్నీషియన్‌ను, ఆర్టిస్టును పేరుపేరునా పలకరిస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా విష్ చేయడం మర్చిపోతే, వెంటనే ‘సారీ.. మిమ్మల్ని చూడలేదు’ అని చెప్పే గొప్ప మనసు ఆయనది. కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ ఎప్పుడూ ఒక జెంటిల్‌మెన్‌లా ఉంటారు. ఆయన హీరో మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప మనిషి’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బన్నీ నిజమైన వ్యక్తిత్వమిదేనంటూ అతని అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బన్నీ గురించి పుష్ప నటుడు ఇంకేం చెప్పారంటే? వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.