Rare Yoga: అరుదైన చంద్ర మంగళ యోగం.. వారికి కష్టనష్టాల నుంచి విముక్తి..!

Rare Yoga: అరుదైన చంద్ర మంగళ యోగం.. వారికి కష్టనష్టాల నుంచి విముక్తి..!


ఈ నెల(ఫిబ్రవరి) 17, 18, 19 తేదీల్లో మకర రాశిలో కుజ, చంద్రులు కలవడం అన్ని విధాలు విశిష్టమైనది. ప్రస్తుతం కుజుడు మకర రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఇక్కడ కుజుడితో చంద్రుడు కలవడం అరుదైన చంద్ర మంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో ఈ యోగం ఏర్పడడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం, మహా భాగ్యయోగం, లక్ష్మీ యోగం వంటివి ఏక కాలంలో కలుగుతాయి. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మూడు నాలుగు రెట్ల ఫలితాలనిస్తాయి.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, చంద్రులు కలవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. శత్రువుల నుంచి సైతం ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, షేర్లు బాగా లాభించడం వంటివి జరుగుతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛ కుజుడిని కలవడం వల్ల ఈ రాశివారికి ధన ధాన్య సమృద్ధి యోగం, లక్ష్మీ కటాక్ష యోగం ఏక కాలంలో పట్టే అవకాశం ఉంది. అప్రయత్న ధనలాభానికి, ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. అదనపు సంపాదనను షేర్లలోనూ, వ్యాపారాల్లోనూ మదుపు చేయడం, వడ్డీలకు తిప్పడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది.
  3. తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల ఫలితంగా ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహ, వాహన యోగాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, లిక్కర్, ఆభరణాలు వంటి రంగాల ద్వారా ఆదాయం పెరగడం, ఈ రంగాలపై మరింతగా పెట్టుబడులు పెట్టడం జరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు చంద్రుడిని కలవడం వల్ల ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఈ రాశివారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్టాకుల వంటివి బాగా లాభించడానికి అవకాశం ఉంది. లక్ష్మీ కటాక్షం కలగడం వల్ల ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. స్థిరాస్తులను పెంచుకునే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ లేదా వడ్డీ వ్యాపారాన్ని చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
  5. మకరం: ఈ రాశిలో కుజుడు ఉచ్ఛపట్టి, చంద్రుడితో కలవడం వల్ల జీవనశైలి మారే అవకాశం ఉంది. ఈ రాశిలో చంద్ర మంగళ యోగం పట్టడం ఒక మంచి అదృష్టంగా భావించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు భారీ జీతభత్యాలతో మంచి ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి.
  6. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. రాజకీయాలు, రియల్ఎస్టేట్, డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారి మీద కనక వర్షం కురుస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. స్థిరాస్తుల మీద మదుపు చేయడం జరుగుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *