Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?


టాలీవుడ్ లవర్ బాయ్, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన ప్రేమకథా చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీలో రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం.ఎస్. రాజు ఈ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. .2001వ సంవత్సరం అక్టోబర్ 19న విడుదలైన మనసంతా నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో కేంద్రాల్లో విజయవంతంగా 175 రోజులకు పైగా ఆడింది. ఉదయ్ కిరణ్- రీమాసేన్ ల కెమిస్ట్రీ, ఆర్.పి.పట్నాయక్ పాటలు, ఎమోషనల్ సీన్స్.. ఇలా ఈ మూవీ విజయానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయ్ కిరణ్ ను లవర్ బాయ్ గానే కాకుండా స్టార్ హీరో రేంజ్ కు దగ్గర చేసిన చిత్రమిది. అలాంటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. సుమారు 25 ఏళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న మనసంతా నువ్వే సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మనసంతా నువ్వే మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

అదేంటంటే.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి హీరోగా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తే తరువాత ఆ అవకాశం ఉదయ్ కిరణ్ కు దక్కిందట. ‘మనసంతా నువ్వే’ ను రిజెక్ట్ చేసిన మొదటి స్టార్ హీరో మరెవరో కాదు మహేష్ బాబు. ఎమ్మెస్ రాజు ఈ సినిమాలో ముందు మహేష్ బాబును హీరోగా అనుకున్నాడు. అయితే మరీ ఇంత సాఫ్ట్ కథ తనకు సూటవ్వదని మహేష్ పెద్దగా ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో దర్శక నిర్మాతలు అక్కినేని సుమంత్ గారిని సంప్రదించారట. అతను కూడా ఈ మూవీపై పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో దర్శక నిర్మాతలు ఉదయ్ కిరణ్ ను సంప్రదించారట. కథ విన్న వెంటనే అతను ఓకే చెప్పడంతో ఈ ప్రేమ కథా చిత్రం పట్టాలెక్కిందట. అలా స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్.

ఇవి కూడా చదవండి

మనసంతా నువ్వే రీ రిలీజ్ గురించి ఉదయ్ కిరణ్ మేనకోడలి మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *