భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు చాలా సాధారణం.. కానీ, అది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? నీరు మన శరీరానికి జీవం పోస్తుంది. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనేక ముఖ్యమైన శారీరక ప్రక్రియలలో సహాయపడుతుంది. కానీ, కొన్నిసార్లు తప్పుడు సమయంలో నీళ్లు తాగటం వల్ల మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారు. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యేలా చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, తినడానికి ముందు, తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 3-4 గంటలు పడుతుంది. ద్రవ ఆహారాలు 20-30 నిమిషాల్లో కడుపు గుండా వెళతాయి. వెంటనే నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ ఎంజైమ్‌ల పనికి అంతరాయం కలుగుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది కడుపు బరువుగా ఉండటం, ఉబ్బరం లేదా అజీర్ణానికి దారితీస్తుంది.
భోజనం చేసేటప్పుడు లేదా భోజనం చేసిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగే బదులు భోజనానికి ముందు లేదా 30 నిమిషాల తర్వాత తాగడం మంచిది. ఇది మీ జీర్ణ ఎంజైమ్‌లు సరిగ్గా పనిచేయడానికి, ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. సరైన సమయంలో నీరు తాగే అలవాటును అలవర్చుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది కడుపును ఉపశమనం చేస్తుంది. ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటే, దాన్ని మెల్లగా మార్చుకోవాలి. భోజనం చేసిన 30–45 నిమిషాల గ్యాప్ తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి బోలెడన్నీ లాభాలు కలిగిస్తుంది. దీని వల్ల పెద్ద లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..