సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ నమ్మించి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఓ 62 ఏళ్ల వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ. 1.07 కోట్లు కాజేసింది. నిందితులను గుర్దీప్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్, కుమార్ మోహిత్‌లుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. బాధితుడికి ఫోన్ చేసిన నిందితులు, తాము ఉన్నత స్థాయి అధికారులమని పరిచయం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాల్లో అతని పేరు ఉందని, తక్షణమే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. నకిలీ ఐడీ కార్డులు, అఫీషియల్ సెటప్‌తో కూడిన వీడియో కాల్స్ చూపిస్తూ బాధితుడిని మానసిక ఒత్తిడికి గురిచేశారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బు చెల్లించాలని నమ్మించి, పలు విడతల్లో రూ. 1.07 కోట్లు వసూలు చేశారు. ఒంటరిగా ఉండే వృద్ధులే వీరి టార్గెట్. డబ్బును వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి, వెంటనే విత్‌డ్రా చేస్తుంటారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, కీలక బ్యాంక్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వీరిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చట్టబద్ధమైన ఏ ప్రభుత్వ సంస్థ కూడా వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయదు లేదా డబ్బులు డిమాండ్ చేయదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
దేశవ్యాప్తంగా వాటర్ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు