Sreeleela : MBBS కంప్లీట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇక డాక్టర్ శ్రీలీల..

Sreeleela : MBBS కంప్లీట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇక డాక్టర్ శ్రీలీల..


టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ జోడిగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే శివకార్తికేయన్ సరసన పరాశక్తి సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ నిరాశ పరిచింది. తాజాగా ధనుష్ నటిస్తున్న కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ఇందులో సాయి పల్లవి సైతం నటిస్తుంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ శ్రీలీల కాస్త డాక్టర్ శ్రీలీల అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

తాజాగా శ్రీలీల వైద్య పట్టా అందుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే అటు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది శ్రీలీల. ఆమె తల్లి గైనకాలజిస్ట్ కావడంతో చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి పెంచుకుంది. సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూనే అటు వైద్య విద్యను పూర్తి చేసింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ఆమె.. తాజాగా కాన్వోకేషన్ వేడుకలో డిగ్రీ పట్టాను అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో ఆమె సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది..

జబర్దస్త్ కమెడియన్..

శ్రీలీల ఇంట్లో ఆమె తల్లితోపాటు అన్నయ్య కూడా డాక్టర్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ లో ధనుష్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *