దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషాద సంఘటన మానవత్వాన్ని కదిలించింది. సోమశేఖర్ పూజర్, వసంత పూజర్ అనే ఇద్దరు అన్నాదమ్ములు బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఆ సమయంలో సోమశేఖర్ వయస్సు నాలుగు సంవత్సరాలు, వసంత్ వయస్సు రెండు సంవత్సరాలు. వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ఆ పిల్లలను చూసుకోవడానికి ముందుకు రాలేదు. అందరూ వదిలేశారు.