Actress : అప్పుడు సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ సెన్సేషన్.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న బ్యూటీ..

Actress : అప్పుడు సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ సెన్సేషన్.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న బ్యూటీ..


పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చక్రం తిప్పుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఆమె పేరు రాగిణి నంద్వాని. తమిళ్ హీరో విజయ్ దళపతి నటించిన తలైవా చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించింది. 2013లో డైరెక్టర్ ఎ.ఎల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక సమస్యల తర్వాత థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ ప్రేయసిగా రాగిణి నటించింది. అందంతోపాటు అభినయంతో అందరిని కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

రాగిణి.. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. 2005లో విడుదలైన అయోధ్య చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో పలు మూవీస్ చేసింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. 2014లో మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ‘పెరుచాళి’లో నటించింది. రాగిణి చివరిసారిగా 2017లో ‘హాథియా’ అనే హిందీ చిత్రంలో కనిపించింది. అప్పటి నుండి ఆమె సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు సినిమాల్లో చక్కని రూపం, అద్భుతమైన నటనతో కట్టిపడేసిన రాగిణి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది..జబర్దస్త్ కమెడియన్..

View this post on Instagram

A post shared by Ragini Nandwani (@ragini.nandwani)

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *