దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈతరం ప్రేక్షకులకు కావాల్సిన అసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సక్సెస్ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు అనిల్ రావిపూడి. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక గతేడాది విక్టరీ వెంకటేశ్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంచలనం సృష్టించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వీరిద్దరి కాంబోలో సంక్రాంతి పండక్కి వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో రూ.300 కోట్లకుపై వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఇదే మూవీ అటు ఓటీటీలోనూ దూసుకుపోతుంది.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
ఇదంతా పక్కన పెడితే.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఫిల్మ్ వర్గాల్లో పలు రూమర్స్ వైరలవుతున్నాయి. అనిల్ రావిపూడి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మరోసారి వెంకీతో చేయనున్నారని సమాచారం. అలాగే ఆ ప్రాజెక్టులో నటించే హీరోయిన్స్, టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి విషయం ఫిక్స్ అయ్యిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. అన్నీ విషయాలు త్వరలోనే చెప్పేస్తానని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
“నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా… నటినటులు, కధ, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో ..మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను.. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన పూర్తి వివరాలు…మీకు అందిస్తాం..” అంటూ బ్రహ్మానందం ఫన్నీ Gif షేర్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ట్వీట్ వైరలవుతుండగా.. ఇప్పటివరకు నెట్టింట చక్కర్లు కొట్టిన రూమర్స్ అన్నింటికి చెక్ పడింది.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది..
జబర్దస్త్ కమెడియన్..
నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏
నటినటులు కధటైటిల్ కూడా పెట్టేసారు ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను….అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైనపూర్తి వివరాలు… మీకు… pic.twitter.com/bfhQ4NrOfu
— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..