ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు

ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు


అది ఒక కుగ్రామం.. కానీ అక్కడ చావు కూడా ఒక శాపంగా మారింది. బ్రతికి ఉన్నప్పుడు పడ్డ కష్టాలు చాలవన్నట్టు, కన్నుమూశాక కూడా ఆ జీవికి ప్రశాంతమైన చివరి మజిలీ దక్కడం లేదు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని పసుపుగల్లు గ్రామంలో నెలకొన్న దయనీయ పరిస్థితి ఇది. గ్రామం నుంచి శ్మశానానికి వెళ్లాలంటే మధ్యలో ‘చిలకలేరు’ వాగు అడ్డంకిగా ఉంది. కిలోమీటరున్నర దూరంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాలంటే మోకాలి లోతు నుంచి నడుము లోతు ప్రవహించే వాగును దాటాల్సిందే. వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత భయానకం. తాజాగా గూడాల అంజిరెడ్డి అనే వ్యక్తి మరణించగా, ఆయన భౌతికకాయాన్ని నడుములోతు నీటిలో ప్రాణాలకు తెగించి గ్రామస్థులు తరలించాల్సి వచ్చింది. ప్రవాహం ఉధృతంగా ఉంటే భుజాలపై శవాన్ని మోస్తూ, నీటితో పోరాడుతూ సాగించే ఈ ‘మహా ప్రస్థానం’ చూస్తుంటే కళ్లు చెమర్చక మానవు. ఈ కష్టాలు కేవలం అంతిమ యాత్రలకే పరిమితం కాలేదు. రైతులు, ముఖ్యంగా మహిళా కూలీలు నిత్యం పొలాలకు వెళ్లాలంటే ఈ వాగు దాటలేక అష్టకష్టాలు పడుతున్నారు. వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం ఉండటంలేదు. దీంతో ఓట్లు వేయించుకునే నాయకులు తమ చావు కష్టాలను పట్టించుకోరా అంటూ.. పసుపుగల్లు గ్రామస్థులు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిలకలేరుపై వంతెన నిర్మించి, తమకు ఈ నరకయాతన నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు

అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *