Snoring in Men: ఆడవారి కంటే మగవారికే గురక ఎక్కువగా ఎందుకు వస్తుంది?

Snoring in Men: ఆడవారి కంటే మగవారికే గురక ఎక్కువగా ఎందుకు వస్తుంది?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల కంటే మహిళలే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా గురక పెట్టే అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ మహిళలు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ పురుషులే మహిళల కంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. కాబట్టి దీనికి కారణం ఏమిటి? ఈ సమస్య పురుషులలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? వంటి విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

పురుషులు ఎక్కువగా గురక పెట్టడానికి గల కారణాలు ఏమిటి?

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని ENT విభాగం అధిపతి డాక్టర్ రవి మహర్ దీని గురించి మాట్లాడుతూ.. పురుషులు ఎక్కువగా గురక పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. పురుషుల గొంతులోని వాయుమార్గం మహిళల కంటే ఇరుకైనది. ఇది నిద్రలో శ్వాస తీసుకునేటప్పుడు ఎక్కువ కంపనానికి కారణమవుతుంది. ఇది గురకకు దారితీస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు వాయుమార్గ కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గడం ప్రారంభించినప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్య వయస్సుతో పాటు కూడా పెరుగుతుంది. మరొక కారణం ఏమిటంటే, మహిళలతో పోలిస్తే పురుషుల గొంతు చుట్టుపక్కల కండరాల చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది గురక పెరగడానికి దారితీస్తుంది.

గురక అంటే వాయుమార్గం స్పల్పంగా మూసుకుపోయినప్పుడు వచ్చే శబ్ధం. అంటే ముక్కు, గొంతు పూర్తిగా తెరచుకోకపోవడం. దీనివల్ల గాలి పీల్చినప్పుడు, బయటకు వదిలినప్పుడు మీ గొంతులోని కణజాలాలు కంపించేలా చేస్తాయి. దీనిని గురక అంటారు. దీనికి ఊబకాయం, టాన్సిల్స్, ముక్కులో నిర్మాణ సమస్యలు, నిద్ర లేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. తేలికపాటి గురక సమస్య కాదు. కానీ ఈ సమస్య అధిక కాలం కొనసాగితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఈ సమస్యలో నిద్రపోతున్నప్పుడు కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి దీనిని విస్మరించడం సరైనది కాదు.

ఇవి కూడా చదవండి

గురకను నివారించడానికి చిట్కాలు..

  • బరువును అదుపులో ఉంచుకోవాలి.
  • పడుకునే ముందు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదు.
  • ఎక్కువగా గురక పెడితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *